తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఏపీ మంత్రి.. కారణం అదే!

4 weeks ago 4
ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చిన మంత్రి.. రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంపై మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చర్చించినట్లు తెలిసింది. ఏపీ ప్రభుత్వం కూడా త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో అమలవుతున్న మహాలక్ష్మి పథకం గురించి రేవంత్ రెడ్డితో మండిపల్లి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
Read Entire Article