తెలంగాణలోని 31 జిల్లాలను డిస్ట్రిక్ట్ ఎక్స్‌పోర్ట్ హబ్ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. స్థానికంగా ప్రపంచస్థాయి సామర్థ్యం ఉన్న ఉత్పత్తులు, సేవలను గుర్తించి గ్లోబల్ మార్కెట్లకు అనుసంధానించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. గతంలోని ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమాన్ని విస్తరించి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. హనుమకొండ, యాదాద్రి భువనగిరి మినహా అన్ని జిల్లాలు ఎంపికయ్యాయి. రాష్ట్రస్థాయిలో సీఎస్ అధ్యక్షతన, జిల్లాల్లో కలెక్టర్ల అధ్యక్షతన ఎగుమతి ప్రోత్సాహక కమిటీలు ఏర్పడి స్థానిక ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెటింగ్, ఎగుమతి అవకాశాలు కల్పించనున్నాయి.