తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర మంత్రిమండలి ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపింది, దీంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ షురూ అయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సిబ్బంది శిక్షణ, పోలింగ్ కేంద్రాల ఎంపిక పూర్తి చేసింది. ప్రతి మండలంలో ఐదు ఎంపీటీసీ స్థానాల పునర్విభజన గురువారంతో ముగిసింది. 12,777 గ్రామ పంచాయతీలు, 5,982 ఎంపీటీసీ, 585 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.