Union Cabinet Approves Two National Highways Expansion in Telangana: తెలంగాణకు కేంద్రం తీపికబురు వినిపించింది. రూ.7597 కోట్లతో రెండు జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్మూర్ - జగిత్యాల- మంచిర్యాల హైవేతో పాటుగా జగిత్యాల- కరీంనగర్ హైవేను నాలుగు వరుసలుగా విస్తరించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్రానికి మంత్రి బండి సంజయ్ ధన్యవాదాలు తెలియజేశారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు గేమ్ ఛేంజర్‌గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.