అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద తెలంగాణలో రూ.3,892 కోట్లతో చేపట్టనున్న ఐదు అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. గోదావరి తాగునీటి పథకానికి రూ.1,992 కోట్లు, వరంగల్ వరదనీటి నిర్వహణకు రూ.1,465 కోట్లు, కోట కందకం అభివృద్ధికి రూ.209.08 కోట్లు, హనుమకొండ బస్ డిపోకు రూ.168.80 కోట్లు, అలంపూర్ ఆలయ అభివృద్ధికి రూ.57.50 కోట్లు కేటాయించారు.