తెలంగాణ రాష్ట్రంలోని జాతీయ రహదారుల అభివృద్ధి, నిర్వహణకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో చేసిన కేటాయింపుల వివరాలు వెల్లడయ్యాయి. పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రాలవారీగా ఆ శాఖకు కేటాయించిన నిధుల పద్దుల్లో ఈ విషయం పేర్కొంది. తెలంగాణలో 39 నేషనల్ హైవేలకు ఎంత మొత్తం ఇచ్చారనేది కేంద్ర ఉపరితల రవాణా శాఖ బడ్జెట్ పద్దుల గణాంకాలను విడుదల చేసింది. అయితే, ఈ మొత్తం కిందటి కేటాయింపులతో పోల్చితే తక్కువే.