తెలంగాణను బలమైన ఆర్థిక రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 'విజన్ డాక్యుమెంట్ 2047'ను ఆవిష్కరించారు. దీని ద్వారా 2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్‌ను నెట్ జీరో సిటీగా మారుస్తామని.. కొత్తగా 'క్యూర్, ప్యూర్, రేర్' పాలసీలు తెస్తామని తెలిపారు. అంతేకాకుండా.. తెలంగాణకు మరో 4 విమానాశ్రయాలు (వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, రామగుండంలో) తీసుకొస్తామని ప్రకటించారు. హైదరాబాద్-మచిలీపట్నం గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం కేంద్రంతో అంగీకారం కుదిరిందని సీఎం వెల్లడించారు.