తెలంగాణకు చల్లని కబురు.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

2 months ago 16
తెలంగాణలో ఎండల తీవ్రత గరిష్ట స్థాయికి చేరింది. ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే.. ఈ నెల 26న నైరుతి రుతుపవనాలు కేరళను తాకి, అక్కడ నుంచి నాలుగైదు రోజుల్లో తెలంగాణకు వస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీవ్రమైన ఎండల దృష్ట్యా ప్రజలు మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని, ఎక్కువగా ద్రవాహారం తీసుకుంటూ వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
Read Entire Article