తెలంగాణకు రైల్వేశాఖ తీపి కబురు అందించింది. త్వరలో కొత్త మెమూ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. కాజీపేట రైల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ద్వారా వీటి ఉత్పత్తి జరగనుంది. 716 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును కేవలం ఏడు నెలల్లో పూర్తి చేయనున్నారు. 2026 మే నుంచి ఇక్కడ కోచ్‌ల ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఈ రైళ్లు గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అనుసంధానతను పెంచుతాయి. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం లభిస్తుందని రైల్వే మంత్రి తెలిపారు.