తెలంగాణలో వాతావరణంపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. బంగాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు జల్లులు కురుస్తాయని చెప్పారు. అదే సమయంలో చలి తీవ్రత పెరుగుతుందని అన్నారు. వచ్చే నాలుగు రోజులు విపరీతమైన చలి ఉంటుందని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.