తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. రెండు రోజుల పాటు..

1 year ago 25
తెలంగాణలో రాబోయే రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆగ్నేయ బంగాళాఖాతం, తూర్పు విదర్భ ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల కారణంగా ఈ వర్షాలు కురుస్తాయి. రేపు సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవవచ్చని తెలిపింది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం, రాత్రి సమయాల్లో వర్షాలు పడతాయని అంచనా వేసింది.
Read Entire Article