కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఏడు బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టుల్లో మూడింటిని తెలంగాణకు కేటాయించడం రాష్ట్ర ప్రగతికి ఒక గొప్ప వరమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం పరిధిలో రూ.87 కోట్ల సీఆర్‌ఐఎఫ్ నిధులతో చేపట్టే రహదారి పనులకు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుండి పుణె, బెంగళూరు, చెన్నై మార్గాల్లో నిర్మించే బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టులకు రూ.5 లక్షల కోట్లు ఖర్చవుతాయని, రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.