ఏపీ ప్రభుత్వంపై, ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్.. తెలంగాణకు రావాల్సిన మూడు అనుమతులను ఏపీ ప్రభుత్వమే కుట్రపూరితంగా ఆపేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలోనే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చాయని.. కానీ కృష్ణ ట్రిబ్యూనల్‌లో ఏపీ ప్రభుత్వం తప్పుడు ఫిర్యాదులు చేసిందని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.