తెలంగాణ సీఎంఆర్‌ఎఫ్‌కు రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం అందజేసింది. ఈ మేరకు చెక్కును సీఎంకు ఆ సంస్థ ప్రతినిధులు శుక్రవారం నాడు అందజేశారు. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా ఖమ్మం నగరంలో మున్నేరు ఉగ్రరూపం దాల్చి.. పలు కాలనీలను ముంచెత్తింది. చరిత్రలో ఎన్నుడూ లేని విధంగా వరద పోటెత్తింది. దీంతో ఖమ్మం కకావికలమైంది. బాధితులు వరదల్లో తీవ్రంగా నష్టపోయారు. పది రోజుల పాటు కొన్ని ఇళ్లు నీటిలోనే ఉండిపోయాయి.