తెలంగాణలో వెదర్‌పై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఈనెల 28న వర్ష సూచన ఉందని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడా వానలు పడొచ్చునని చెప్పారు. ఈ మేరకు అలర్ట్ జారీ చేశారు.