తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, హెచ్చరికలు జారీ

1 month ago 10
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు, కర్ణాటక ఉపరితల ఆవర్తనం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న నాలుగు రోజులు వర్షాలు కొనసాగుతాయని.. ఈ మేరకు వాతావరణశాఖ అధికారులు నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గడిచిన 24 గంటల్లో భూపాలపల్లిలో 106.5 మి.మీ అత్యధిక వర్షపాతం నమోదైంది. మంగళవారం హైదరాబాద్‌లో కురిసిన కుంభవృష్టికి నగరం అతలాకుతలమైంది. పాతబస్తీలో కరెంట్ తీగ పడి ఇద్దరు మృతి చెందారు. ఐటీ కారిడార్, మలక్‌పేట్, కూకట్‌పల్లి సహా పలు ప్రాంతాలు జలమయమై రవాణా వ్యవస్థ స్తంభించింది.
Read Entire Article