తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉందని అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది.