AP Govt Decision On 36% Medical Seats: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు కేటాయించిన 36 శాతం మెడికల్ సీట్లను ఇకపై ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకే కేటాయించనున్నారు. ఈ నిర్ణయం 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది. మరోవైపు రాష్ట్రంలోని ఐదు కొత్త మెడికల్ కాలేజీల్లో 150 సీట్లకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి లభించింది. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో వసతులు సరిగా లేని కారణంగా జరిమానా విధించారు.