తెలంగాణను తాకిన నైరుతి.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ

3 months ago 14
తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. సోమవారం (జూన్ 8) ఇవి దక్షిణ సరిహద్దు జిల్లా అయిన జోగులాంబ గద్వాలను తాకాయి. రానున్న రెండు రోజుల్లో ఇవి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనికి తోడు ఉత్తరప్రదేశ్ నుండి కోస్తాంధ్ర వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా మంగళవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ నెల 14 వరకు తేలికపాటి వానలు పడే అవకాశం ఉండటంతో అధికారులు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో అర్థరాత్రి, తెల్లవారుజామున వానలు పడనున్నాయి.
Read Entire Article