తెలంగాణపై నిప్పుల వర్షం.. 47 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు, రెడ్ అలర్ట్ జారీ

3 months ago 17
తెలంగాణ వ్యాప్తంగా మే 14 నుండి 21 వరకు తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల సెల్సియస్ చేరే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్‌లో సైతం 42-44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. మధ్యాహ్నం ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, డీహైడ్రేషన్‌కు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వడదెబ్బ తగలకుండా నీళ్లు, ఓఆర్‌ఎస్ వంటివి తీసుకోవడం తప్పనిసరి అని చెబుతున్నారు.
Read Entire Article