తెలంగాణలో భారీగా పెన్షన్లు రద్దు అయ్యాయి. ఏకంగా 1.28 లక్షల పెన్షన్లను అధికారులు రద్దు చేశారు. అనర్హులను గుర్తించే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రకరకాల కారణాలతో పెన్షన్ లబ్ధిదారుల జాబితా నుంచి అనర్హులను ఏరివేశారు. అదే సమయంలో కొత్త పెన్షన్లను జారీ చేసేందుకు లబ్ధిదారులను కూడా గుర్తించారు. ఈ క్రమంలోనే 48 వేల మందికి కొత్త పింఛన్లు అందించనున్నారు.