తెలంగాణలో 100 మంది వీఐపీలకు సెక్యూరిటీ తగ్గింపు.. జులై 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు

2 months ago 13
తెలంగాణలో వామపక్ష తీవ్రవాద ముప్పు దాదాపుగా సమసిపోవడంతో ప్రముఖులకు కల్పిస్తున్న భద్రతను నిఘా విభాగం భారీగా తగ్గించింది. భద్రతా సమీక్ష కమిటీ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం.. రాష్ట్రంలోని 100 మందికి పైగా ప్రముఖుల సెక్యూరిటీని కుదిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నూతన నిబంధనలు జులై 1 నుంచి అమలులోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం సైతం దేశాన్ని మావోయిస్టు రహితంగా ప్రకటిస్తున్న తరుణంలో.. క్షేత్రస్థాయి నిఘా సమాచారాన్ని మదింపు చేసి పారదర్శకంగానే ఈ భద్రతను తగ్గించినట్లు ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
Read Entire Article