తెలంగాణలో కొత్తగా వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు రానున్నాయి. వీటిని 2027 డిసెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ఏఏఐ (AAI) లక్ష్యంగా పెట్టుకుంది. వరంగల్‌లో ఇప్పటికే భూసేకరణ దాదాపు పూర్తయ్యింది. ఆదిలాబాద్‌లో భారత వాయుసేన అనుమతి లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ కొత్త విమానాశ్రయాలు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడనుండగా.. ప్రస్తుతం ఉన్న శంషాబాద్ విమానాశ్రయంపై భారం తగ్గుతుంది.