తెలంగాణలో ఎస్ఐఆర్ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్లకు పైగా ఉన్న ఓటర్లలో ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించిన 2.64 కోట్ల మందితో ముసాయిదా జాబితాను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు.. సుమారు 92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నారు. నోటీసులు అందుకున్న వారు సెప్టెంబర్ 16లోగా తమ వివరాలు, అవసరమైన పత్రాలతో స్పందించాల్సి ఉంటుందని తెలిపారు. ఇక ఓటు తొలగింపుపై అభ్యంతరాలు ఉంటే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.