మంత్రి పదవి ఇస్తామని చెప్పి నాగబాబును మోసం చేశారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విమర్శించారు. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని గతంలో లేఖ విడుదల చేసిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు మోసం చేశారని అన్నారు. మాట ఇచ్చి తప్పడం చంద్రబాబుకు అలవాటేనని మరోసారి నిరూపించుకున్నారని సెటైర్లు వేశారు. మరోవైపు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా నాగబాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయిన సంగతి తెలిసిందే.