తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి మంచినీటి చేపల ఎగుమతుల కేంద్రం ఏర్పాటు కానుంది. దేశంలోనే చేపల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నందున ఈ కేంద్రాన్ని రూ.47 కోట్లతో రంగారెడ్డి జిల్లా కొహెడలో నిర్మించనున్నారు. ఈ కేంద్రం ద్వారా మత్స్య పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు వస్తాయని, స్థానికంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుందని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు.