సంగారెడ్డి జిల్లా పర్వతపూర్ బ్లాక్‌లో ఉన్న వెనేడియం, టైటానియం గనులను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. ఈ గనులకు ప్రాధాన్య బిడ్డర్‌గా కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ తమను ప్రకటించిందంటూ.. నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ ఆఫ్ ఇండియాకు ఈ సంస్థ సమాచారం అందించింది. మరోవైపు ఈ అరుదైన, విలువైన ఖనిజాలు రక్షణ రంగ పరికరాల తయారీలో ఉపయోగపడతాయని నిపుణులు చెప్తున్నారు.