తెలంగాణ పామాయిల్ రైతులకు శుభవార్త. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అప్పారావుపేట ఫ్యాక్టరీలో ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేషియో (OER) రికార్డు స్థాయిలో 20.01 శాతంగా నమోదైంది. ఈ అధిక ఓఈఆర్ కారణంగా పామాయిల్ గెలల ధరలు పెరగనున్నాయి. ప్రస్తుతం టన్ను ధర రూ. 19,400 ఉండగా.. వచ్చే నెల నుంచి రూ. 500 లకు పైగా పెరిగే అవకాశం ఉంది. ఈ ఓఈఆర్ పెంపు రైతులకు శుభ పరిణామమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణను ఆయిల్ పామ్ హబ్‌గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.