తెలంగాణలో ఈనెల 10 నుంచి అసలైన ఎండలు.. గరిష్ఠంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు, నిపుణుల హెచ్చరికలు

4 months ago 19
రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఎండలు దంచనున్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈనెల 10 నుంచి భానుడి అసలైన భగభగలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో గరిష్ఠంగా 43 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని పేర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపై భానుడు ఉగ్రరూపం చూపనున్నాడని.. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Read Entire Article