తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణమాలు చోటుచేసుకోనున్నాయి. మరోసారి తెలంగాణలో ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పే ఇందుకు నిదర్శనమంటున్నారు బీఆర్ఎస్ నేతలు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉపఎన్నికలు రావటం ఖాయమని.. అందులో బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుపొందనుందని ధీమా వ్యక్తం చేశారు.