తెలంగాణలో ఏ గ్యాడ్యుయేట్‌తో పాటు 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఒకట్రెండు స్థానాల్లో మినహా.. మిగతా అన్ని ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగింది. అయితే.. గ్యాడ్యుయేట్ల కంటే.. ఎక్కువగా టీచర్లే ఓటు హక్కును వినియోగించుకున్నట్టు తెలుస్తోంది. ఏకంగా 93.55 శాతం టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ ఏర్పటమే ఇందుకు నిదర్శనం. ఇక.. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో 78 శాతం పోలింగ్ నమోదు కావటం గమనార్హం.