వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెంలలో విమానాశ్రయాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. వరంగల్ ఎయిర్‌పోర్ట్ కోసం ఇప్పటికే 953 ఎకరాల భూమిని కేంద్రానికి అప్పగించామని త్వరలోనే శంకుస్థాపన చేస్తామని తెలిపారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని, కొత్తగూడెం ప్రాజెక్టుపై మరోసారి అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఈ ఎయిర్‌పోర్ట్‌లు కీలకం కానున్నాయని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.