విదేశాల్లో ఉద్యోగాలు సాధించే తెలంగాణ యువతకు తీపి కబురు. వారికి ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సీఎం విదేశీ ఉపాధి పథకాన్ని ప్రారంభించింది. టామ్‌కామ్ ద్వారా అమలయ్యే ఈ పథకంలో 2026-27లో 7 వేల మందికి సాయం చేయనున్నారు. నేరుగా ఉద్యోగాలకు వెళ్లేవారికి రూ.50 వేల వరకు, విదేశీ భాషల ప్రావీణ్యం అవసరమైన ఉద్యోగాలకు వెళ్లేవారికి రూ.1.75 లక్షల వరకు రాయితీ అందుతుంది. 18-40 ఏళ్ల తెలంగాణ స్థానికులు అర్హులు.