తెలంగాణలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దసరాకు ముందే కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క.. సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటికే 43 లక్షలకు పైగా మందికి పింఛన్లు అందుతుండగా.. తాజాగా మరో 2.25 లక్షల మందిని కొత్తగా లబ్ధిదారుల జాబితాలో చేర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా వితంతువులు, ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లలో ప్రాధాన్యత ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి పెట్టింది.