కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి మంత్రి ఉత్తమ్ గుడ్‌న్యూస్ చెప్పారు. సంక్రాంతి తర్వాత రేషన్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు. రేషన్ కార్డులతో పాటుగా.. సన్న బియ్యం కూడా ఇవ్వనున్నట్లు మంత్రి ఉత్తమ్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. కేవలం అర్హులైన వారికి మాత్రమే రేషన్ కార్డులు ఇస్తామన్నారు.