తెలంగాణలో త్వరలోనే మరో కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి రానుంది. కరీంనగర్ – హసన్‌పర్తి మధ్య ప్రాజెక్ట్ గతంలోనే ట్రాక్ నిర్మాణానికి ప్రతిపాదనలు రాగా.. తాజాగా పనుల్లో వేగం పెంచాలని రైల్వే మంత్రిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు. దాంతో పాటుగా ఉప్పల్ రైల్వే స్టేషన్ అప్‌గ్రేడ్ చేయాలని లేఖను అందించారు.