తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో తన పార్టీ పేరు 'తెలంగాణ రాష్ట్ర సేన' అని వెల్లడించారు. పార్టీ జెండాను సైతం ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఈ పార్టీ పనిచేస్తుందని ఆమె ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మను కోల్పోయిందని అందుకే తాను టీఆర్ఎస్ పేరుతో పార్టీ పెట్టాల్సి వచ్చిందని కవిత వెల్లడించారు.