Union Govt Green Signal To Two National Highways: తెలంగాణలో రెండు కొత్త జాతీయ రహదారులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల, జగిత్యాల-కరీంనగర్ రోడ్లను 4 వరుసలుగా అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. రూ.7,597.16 కోట్ల అంచనా వ్యయంతో ఈ రెండు కొత్త హైవేలుకు గ్రీన్‌సిగ్నల్ రాగా.. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగంపై మాత్రం నిర్ణయం తీసుకోలేదు.