ప్రస్తుతం తెలంగాణలో హైదరాబాద్‌లో బేగంపేట, శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమనాశ్రయాలు మాత్రమే ఉన్నాయి. వరంగల్ జిల్లాలోని మామునూరులోని విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. దీంతో పాటు కొత్తగా నాలుగు విమానాశ్రయాలు ప్రతిపాదనలో ఉన్నట్టు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మించాలని భావిస్తున్నట్టు పేర్కొంది. ఈ క్రమంలో తెలంగాణ ఎంపీలు ఇదే అంశంపై కేంద్రాన్ని లోక్‌సభలో ప్రశ్నించారు.