తెలంగాణలో ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో (టీమార్స్) ఏర్పాటు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. అదనపు డీజీపీ లేదా ఐజీ నేతృత్వంలో పనిచేసే ఈ విభాగంలో సుమారు 900 మంది సిబ్బందిని కేటాయించనున్నారు. ట్రాఫిక్ చలానాల ఆదాయంలో 50 శాతం కొత్త బ్యూరోకు కేటాయించాలని ప్రతిపాదించారు. రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ నిర్వహణకు ఏకరీతి విధానం తీసుకురావడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం టీమార్స్ ప్రధాన లక్ష్యాలుగా ఉండనున్నాయి.