గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన 783 మందికి హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతం నుంచి 10-15 శాతం కోత విధించి.. ఆ మొత్తాన్ని వారి ఖాతాలో వేస్తామని.. దీనికోసం త్వరలో చట్టం తెస్తామని ఆయన ప్రకటించారు. గత పాలకుల వైఫల్యాల వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని సీఎం స్పష్టం చేశారు.