రాష్ట్రంలో నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. మరికొన్ని రోజుల్లోనే మరో 30 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి.. ఆయన వివరించారు. తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాల కోసం దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రాజీవ్ ఆరోగ్యశ్రీ, సన్నబియ్యం పంపిణీ సహా పలు వివరాలను వెల్లడించారు.