తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో నేడు పొడి వాతావరణం ఉంటుందని చెప్పారు. పలు ప్రాంతాల్లో మాత్రం వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. చల్ల గాలుల తీవ్రత పెరిగిందని.. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పడిపోతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.