Telangana Govt Declares Holiday Today: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతపాన్ని తెలియజేశారు. ఈ మేరకు ప్రభుత్వం సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం తెలంగాణలో సెలవు దినంగా ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్య సంస్థలకు సెలవు ప్రకటించింది. అలాగే మన్మోహన్ సింగ్ మృతితో రాష్ట్రంలో వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. ఈ మేరకు సీఎస్ శాంతకుమారి గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.