తెలంగాణలో పెన్షన్లు తీసుకునేవారికి గుడ్‌న్యూస్.. ఇక ఆ ఇబ్బంది లేదు, చాలా ఈజీగా..!

7 months ago 6
తెలంగాణలో చేయూత పెన్షనర్లకు గుడ్‌న్యూస్. జూలై 29 నుంచి ఫేషియల్ రికగ్నిషన్ విధానం ద్వారా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. వేలిముద్రలు సరిగా లేకపోవడం, మోసాలను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. తొలిదశలో పోస్టాఫీసుల ద్వారా పెన్షన్ పొందే 23 లక్షల మందికి ఇది వర్తిస్తుంది. దీనికోసం ప్రత్యేక యాప్, కొత్త స్మార్ట్‌ఫోన్లు, శిక్షణ వంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫేషియల్ రికగ్నిషన్ సాధ్యం కానివారికి బయోమెట్రిక్ లేదా గ్రామ కార్యదర్శుల ద్వారా పెన్షన్ అందజేస్తారు. ఈ కొత్త విధానంతో పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Read Entire Article