తెలంగాణలో బక్రీద్ సెలవు మారింది. మొదట ఈనెల 27న బక్రీద్ పండగ సెలవును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే బక్రీద్ సెలవును ఈనెల 27న కాకుండా 28కి మార్చినట్లు తెలిపింది. దీంతో ఆ రోజున జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇంటర్ సప్లిమెంటరీ సహా వేర్వేరు పరీక్షలు ఈనెల 28వ తేదీన ఉండగా.. వాటిని వేర్వేరు తేదీలకు రీషెడ్యూల్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో కొత్త హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.