KTR E-Formula Car Racing Case: త్వరలోనే తెలంగాణలో బాంబులు పేలనున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పినట్టుగానే.. అందులో ఓ బాంబు బ్లాస్ట్ అయ్యేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. చాలా రోజులుగా ఆరోపణలు వస్తున్న.. ఈ-కార్ రేసింగ్ కేసు విచారణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో.. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విచారించేందుకు ఏసీబీకి మార్గం సుగమమైనట్టయింది.