Telangana IAS Transfers: తెలంగాణళో మరోసారి భారీ ఎత్తున బదిలీల కార్యక్రమం చేపట్టింది ప్రభుత్వం. 13 మంది ఐఏఎస్‌లతో పాటు.. రెవెన్యూ శాఖలో ఒకేసారి 70 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఐఏఎస్‌లలో ఓ డేరింగ్ లేడీ ఐఏఎస్‌కు రేవంత్ రెడ్డి సర్కార్ కీలక శాఖ బాధ్యతలు అప్పగించటం గమనార్హం. మరోవైపు.. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా 70 మందిని బదిలీ చేయటం కూడా చర్చనీయాశంగా మారింది.