దేశంలో నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న వేళ.. అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య భారీగా పెరగనుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోనూ ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో గణనీయమైన పెరుగుదల ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక లోక్‌సభ స్థానాల సంఖ్య 26కు.. అసెంబ్లీ సీట్ల సంఖ్య 179కు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేషన్ల బిల్లు అమల్లోకి రానుంది.