Kinjarapu Rammohan Naidu: తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు.. కీలక ప్రకటన చేశారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వ హయాంలోనే వరంగల్ జిల్లాలోని మామునూరు విమానాశ్రయాన్ని కచ్చితంగా పూర్తి చేస్తామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. వరంగల్‌తో పాటు మరో మూడు.. పెద్దపల్లి, కొత్తగూడెం, ఆదిలాబాద్ విమానాశ్రయాలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారని.. వాటిపై నివేదిక వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.